BJP In Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అంతం చేసి, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రతీ శుక్రవారం రాళ్లు రువ్వే సంస్కృతికి చరమగీతం పలికింది. అయినా కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలోని ఓటర్లు బీజేపీకి వేటేసేందుకు పెద్దగా ఇష్టం చూపలేదు. ఈ విషయం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి చూస్తే తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ‘నయా కాశ్మీర్’ నినాదం పెద్దగా పనిచేయలేదని తెలుస్తోంది. సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. చూస్తే జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి 95 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 40-48 స్థానాలు గెలుచుకుంటుందని అంచానా వేసింది.
ఇక్కడ జమ్మూ ప్రాంతంలో మాత్రం బీజేపీ ఘనంగా బలపడుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. జమ్మూలో ఉన్న 43 సీట్లలో బీజేపీ 27-31 స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నాయి. ఇక కాశ్మీర్ లోయలోని 47 స్థానాల్లో మాత్రం బీజేపీ ఖతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి మాత్రం గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా బలపడకపోయినప్పటికీ, ఎన్సీ సొంత బలంపైనే ఆధారపడింది.
Read Also: S Jaishankar :జార్జ్ సోరోస్ లేదా కిమ్ జోంగ్ ఉన్‌తో డిన్నర్.. జైశంకర్ రిఫ్లై అదుర్స్..
అసలు ఎక్కడ తప్పు జరిగింది..?
లోక్‌సభ ఎన్నికల్లో లోయలోని మూడు పార్లమెంట్ సెగ్మెంట్లకు బీజేపీ పోటీ కూడా చేయలేదు. ఇక్కడే బీజేపీకి సీన్ అర్థమైంది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఆటంకం అని ఒప్పించడంలో బీజేపీ విఫలమైంది. తమకు ఉన్న హక్కును బీజేపీ తీసేసిందనే భావన లోయలోని ముస్లింలలో పేరుకుపోయింది. దీనికి తోడు ఆర్టికల్ 370 రద్దు సమయంలో చాలా రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆంక్షలు విధించడం కూడా ప్రజల్లో కోపాన్ని నింపింది.
దీనికి తోడు ఫరూఖ్ అబ్దుల్లా ఎన్సీ, మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీలు ఆర్టికల్ 370 రద్దుని తమకు జరిగిన అన్యాయంగా చిత్రీకరించాయి. దీనిని బీజేపీ బలంగా కౌంటర్ చేయలేకపోయింది. తీవ్రవాదం, వేర్పాటువాదం, రాళ్లదాడులు తగ్గినప్పటికీ, ఇక్కడ ప్రజలు తమ మాట్లాడే హక్కును కోల్పోయామనే భావనని కలిగి ఉన్నారు. దీంతోనే లోయపై బీజేపీ పట్టు కోల్పోయింది. కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడి స్థానిక విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని బీజేపీ హామీ ఇచ్చింది. దీంట్లో పెద్దగా పురోగతి లేకుండా పోయింది. ఏదైమైనా జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ, లోయలోని ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే భావన ఎగ్జిట్ పోల్స్‌లో వ్యక్తమైంది.