NTV Telugu Site icon

S Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

S Jaishankar

S Jaishankar

S Jaishankar: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఎన్నికల పోటీపై స్పందిస్తూ.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ఐదు అధ్యక్షుల కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారత్-యూఎస్ సంబంధాలు మాత్రమే పెరుగుతాయని చెప్పారు.

Read Also: Rajnath singh: బీజేపీని గెలిపిస్తే.. జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం

గత 5 అధ్యక్ష సమయాల్లో అమెరికాతో మా సంబంధంలో స్థిరమైన పురోగతి చూశామని, అందులో ట్రంప్ అధ్యక్ష పదవి కూడా ఉందని చెప్పారు. కాబట్టి అమెరికా ఎన్నికలను చూసినప్పుడు, ఏ తీర్పు వచ్చినా అమెరికాతో మా సంబంధాలు మాత్రమే పెరుగుతాయని మాకు నమ్మకం ఉందని జైశంకర్ చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కి ఎక్కువ ప్రయోజనం అనే చర్చ నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల కాలంలో హిందువులకు అండగా నిలుస్తానని మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని ఖండించారు. మోడీతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. మోడీని గొప్ప మనిషిగా పేర్కొన్నారు. మరోవైపు భారత మూలాలు ఉన్న కమలా హారిస్ డెమోక్రాట్ల తరుపున పోటీలో ఉన్నారు. రిపబ్లికన్ల తరుపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.