NTV Telugu Site icon

Women’s Reservation Bill: మహిళా బిల్లును స్వాగతించిన కాంగ్రెస్.. పీఎం మోడీకి రాహుల్ గాంధీ రాసిన పాత లేఖ వైరల్..

Rahul Gandhi

Rahul Gandhi

Women’s Reservation Bill: మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్ధాలుగా ఉన్న మహిళా బిల్లుకు కీలక ముందడుగు పడింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించబడిన మహిళా బిల్లుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. మరో నేటి నుంచి మరో నాలుగు రోజులు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురాబోంది.

అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ దీన్ని స్వాగతించింది. ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జైరాం రమేష్ ఎక్స్(ట్విట్టర్)లో 2018లో ప్రధాని నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ రాసిన లేఖను మళ్లీ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read Also: Asaduddin Owaisi: “మాకు టికెట్ ఇస్తే హిందువుల ఓట్లు రావని”.. ఇండియా కూటమిపై ఓవైసీ ఫైర్..

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 2018లో మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించింది. అయితే రెండేళ్ల తరువాత ఎగువసభలో బిల్లను ఆమోదించిన తర్వాత, బిల్లు స్తంభించిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ చట్టంగా మారలేదు. మిగతా పార్టీల నుంచి దీనికి అడ్డంకులు వస్తున్నాయి. మహిళా కోటాలో వెనకబడిన తరగతులకు కోటా కోసం డిమాండ్లు వస్తున్నాయి.

జూలై 16, 2018న పీఎం మోడీకి రాహుల్ గాంధీ లేక రాశారు. ‘‘మహిళ సాధికారత కోసం మన ప్రధాని ఒక క్రూసేడర్ అని చెప్పారు?.. బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ నుంచి మద్దతు ఉంటుందని లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అప్పటి కేంద్ర మంత్రి దివంగత అరుణ్ జైట్లీ ఈ బిల్లును చారిత్రకమైందని, ముఖ్యమైందని అభివర్ణించారు.

కాంగ్రెస్ తన ట్వీట్ లో.. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనేది కాంగ్రెస్ దీర్ఘకాలిక డిమాండ్ అని, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బిల్లు వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, గోప్యంగా చర్చించే బదులుగా, ఏకాభిప్రాయంతో ఈ బిల్లు తీసుకురావచ్చని ట్వీట్ చేసింది.