NTV Telugu Site icon

Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌‌పై అన్నామలై ఆగ్రహం..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడులో ‘‘త్రి భాషా విధానం’’పై కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని బలవంతంగా ప్రయోగిస్తు్న్నారంటూ తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా, హిందీపై నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శలు గుప్పించారు.

హిందీ భాష విషయంలో విజయ్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ అన్నామలై ఆరోపించారు. విజయ్‌ని ‘‘సోదరుడిగా’’ పలిచే అన్నామలై.. విజయ్ పాఠశాల ‘‘విజయ్ విద్యాశ్రమం’’లో మూడు భాషల విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారంటూ ప్రశ్నించారు. బయట మాత్రం ఆయన విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం(టీవీకే) రెండు భాషల వ్యవస్థ కోసం మాట్లాడుతోందని, ఇది ఆయన పార్టీ ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’ అంటూ అన్నామలై మండిపడ్డారు.

Read Also: Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్‌పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

‘‘ విజయ్‌కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు బోధించేది, ఆచరించు బ్రో. నువ్వు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు. మీరు నడుపుతున్న విజయ్ విద్యాశ్రమ పాఠశాలలో మూడు భాషలు ఉన్నాయి. కానీ మీ పార్టీ కార్యకర్తల పిల్లలు మాత్రం రెండు భాషల్లో చదువుకోవాలా..? ’’ అంటూ కోయంబత్తూర్‌లో జరిగిన ఒక సభలో అన్నామలై అన్నారు.

అంతకుముందు, త్రిభాషా విధానం, హిందీపై నలుడు విజయ్ విమర్శలు గుప్పించారు. టీవీకే మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. ఈ అంశంపై విభేదిస్తున్నట్లు నటిస్తూనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రం వైఖరిని విమర్శిస్తూ, ఆయన రాజకీయ పోరాటాన్ని చిన్నపిల్లల గొడవతో పోల్చారు. బీజేపీ, డీఎంకేలు సోషల్ మీడియాలో ‘‘హ్యాష్ ట్యాగ్స్’’తో ఆడుకుంటున్నారని ఆరోపించారు.