Bengal panchayat polls: గత నెల కాలంగా పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింస నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా ఈ రోజు ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) హవా కొనసాగింది. ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ కలిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 36,229 సీట్లు ఉన్నాయి. వీటిలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 14,767 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 3,344 సీట్లతో రెండో స్థానంలో ఉంది. చాలా చోట్ల టీఎంసీ ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్న సీపీఎం కేవలం ఇప్పటి వరకు 1,056 గ్రామపంచాయతీ సీట్లలోనే గెలుపొందింది. కాంగ్రెస్ 783 సీట్లను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు 854 స్థానాల్లో గెలుపొందారు.
Read Also: Game Changer: ‘గేం చేంజర్’కి కొత్త డైరెక్టర్.. ఆ ఫొటోతో ఖండించిన శంకర్!
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 339 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 3,317 గ్రామపంచాయతీల్లో 1,783 పంచాయతీల్లో టీఎంసీ లీడింగ్ లో ఉంది. బీజేపీ 262 గ్రామపంచాయతీల్లో, కాంగ్రెస్ 137 పంచాయతీల్లో, లెఫ్ట్ 112 పంచాయతీల్లో లీడింగ్ లో ఉంది. మొత్తం 341 పంచాయతీ సమితిల్లో 28 సమితిల్లో టీఎంసీ లీడింగ్ లో ఉంది.
బెంగాల్లో మొత్తం 3,317 గ్రామపంచాయతీల్లో మొత్తం 63,229 స్థానాలు ఉన్నాయి. 341 పంచాయతీ సమితీల్లో 9,730 సీట్లకు, 20 జిల్లా పరిషతుల్లో 928 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా హింస చెలరేగింది. బీజేపీ, టీఎంసీతో పాటు పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు చనిపోయారు. ఎన్నికల హింసలో 21 మంది మరణించారు. ఎన్నికల బూత్ లను ఆక్రమించడంతో పాటు కొన్ని జిల్లాల్లో బాలెట్ బాక్సుల్ని ఎత్తుకెళ్లారు.