West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పుకు బీజేపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 6న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి అనుగుణంగా పేరు మార్పు అంశాన్ని గతంలో బీజేపీ తెర పైకి తీసుకువచ్చింది. రాష్ట్రం పేరును ‘‘పశ్చిమ బంగా’’గా మార్చేందుకు అసెంబ్లీలో తీర్మానం పెట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా గతంలో ప్రకటించారు. రాష్ట్ర చరిత్రతో పేరును అనుసంధానించడమే పేరు మార్పు ఉద్దేశమని బీజేపీ చెబుతోంది.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో గోవధను అనుమతించబోమని సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇప్పటికీ రహస్యంగా గోవధ జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1950 నాటి పశువుల చట్టాన్ని అమలు చేశామని, ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని తెలిపారు.

