West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి
8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.
మాల్ నదీలో దుర్గా మాత విగ్రహం నిమజ్జనం కోసం వందలాది మంది గుమిగూడారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మాల్ నదీ ప్రవాహం పెరిగింది. ఊహించని విధంగా మెరుపు వరద సంభవించడంతో చాలా మంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. చాలా మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. దాదాపుగా 50 మందిని ఈ వరదల నుంచి రక్షించారు.
Also Read
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
Read Also: CM KCR: సీఎంగా ఉంటూనే.. దేశమంతా పర్యటిస్తా
అకాస్మత్తుగా, ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు కొట్టుకుపోయారని.. ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించామని జల్పాయిగురి కలెక్టర్ మౌమితా గోదారా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్, పోలీస్, స్థానిక రెవెన్యూ యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తప్పిపోయివ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా దుర్గా విగ్రహ నిమజ్జనం వేడుకలో విషాదం నెలకొంది. సికంద్రా పీఎస్ పరిధిలో 15 ఏళ్ల బాలుడు, న్యూ ఆగ్రా పీఎస్ పరిధిలో ఇద్దరు యువకులు యమునా నదిలో మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ జరిగినా మృతదేహాలు లభించలేదు.
Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now.
I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO— Suvendu Adhikari (@SuvenduWB) October 5, 2022
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!