NTV Telugu Site icon

Weather Alert: నేడు పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం..!

Weather

Weather

Weather Alert: భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో నేడు ( సోమ), రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతు పవనాలు దేశంలో చురుకుగా కదిలే అవకాశం ఉందన్నారు. అయితే, మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also: KCR Petition: నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి

కాగా, సిక్కిం, ఒడిశా, తూర్పు మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ మధ్య ప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొనింది. అయితే, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి.. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు కూడా భారీ వర్షం కురిసింది.