NTV Telugu Site icon

కేంద్రం ధీమా: జులై చివ‌రి నాటికి 51 కోట్ల డోసులు…

దేశంలో వేగంగా క‌రోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఇప్ప‌టికే 45 కోట్ల‌కు పైగా టీకాలు వేసిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.  అయితే, గ‌త కొన్ని రోజులుగా వ్యాక్సినేష‌న్ మంద‌కోడిగా జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌తిపక్షాలు విమ‌ర్శిస్తున్నాయి.  ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కేంద్ర ఆరోగ్య‌శాఖ కొట్టిపారేసింది. గ‌తంలో చెప్పిన విధంగానే జులై 31 నాటికి ఎట్టిప‌రిస్థితుల్లో కూడా 51 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేస్తామ‌ని ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాల‌కు కేంద్ర పాలిత ప్రాంతాల‌కు క‌లిపి 45.7 కోట్ల డోసులు పంపిణీ చేశామ‌ని, మ‌రో 6.03 కోట్ల డోసుల‌ను కూడా జులై 31 నాటికి పంపిణీ చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.  

Read: ‘కె.జి.ఎఫ్‌. -2’ ఆలస్యానికి అదే కారణమా!?