NTV Telugu Site icon

Bangladesh: “పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ అణు ఒప్పందం చేసుకోవాలి”.. ఢాకా ప్రొఫెసర్ భారత వ్యతిరేఖ వ్యాఖ్యలు..

Shahiduzzaman

Shahiduzzaman

Bangladesh: బంగ్లాదేశ్ మరో పాకిస్తా్న్‌గా మారేందుకు ఆ దేశానికి దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉగ్రవాదులు, రాడికల్ ఇస్లామిక్ భావాలు కలిగిన వ్యక్తులు తరుచుగా భారత వ్యతిరేక, పాక్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మహ్మద్ అలీ జిన్నా వర్ధంతి వేడుకలు ఢాకాలో జరిగాయి. వక్తులు జిన్నాని బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచారు.

ఇదిలా ఉంటే, తాజాగా ఢాకా యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ భారతదేశంపై విషం ప్రచారం చేశాడు. బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్‌ని అరికట్టడానికి పాకిస్తాన్ సాయం తీసుకోవాలని, పాక్‌తో బంగ్లాదేశ్ అణు ఒప్పందం కుదుర్చుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రొఫెసర్ షాహిదుజ్జామాన్ భారత్‌పై ద్వేషాన్ని రగిలిస్తూ.. ‘‘భారత్‌కి అలవాటైన అవగాహన మార్చడానికి, బంగ్లాదేశ్‌ని అణ్వాయుధ సామర్థ్యం గల, అణ్వాయుధీకరణగా మార్చడమే సరైన సమాధానం. అణ్వాయుధ సామర్థ్యం ఉన్నందున మనం అణుశక్తిగా మారాలని కాదు, అణ్వాయుధ సామర్థ్యం ద్వారా, మన మాజీ ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మనం అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నా ఉద్దేశ్యం’’ అని అన్నాడు.

Read Also: Minister Ram Prasad Reddy: మంగంపేట భూనిర్వాసితులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన మంత్రి

ఇదే కాకుండా.. పాకిస్తాన్ సాంకేతిక సహకారం లేకుండా భారత్‌ని అడ్డుకోలేమని ఆయన అననారు. పాకిస్తాన్ ఎల్లప్పుడు బంగ్లాదేశ్‌కి అత్యంత విశ్వసనీయమైన భద్రతా భాగస్వామి. కానీ భారతీయులకు మనం ఈ విషయాన్ని నమ్మడం ఇష్టం లేదని, దీన్ని నమ్మవద్దని అవామీ లీగ్ కూడా కోరుతోందని, అయితే, బంగ్లాదేశ్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చాడు. ‘‘పాకిస్తానీయులకు అసూయపడే హృదయం ఉంది. కానీ మనం భారత్‌తో కలిసి ఉండటం ఇష్టం లేదు. భారత్ నుంచి మనల్ని రక్షించడానికి పాకిస్తాన్ దేనికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పాడు.

ప్రొఫెసర్ షాహిదుజ్జామన్ మాట్లాడుతూ.. అణు క్షిపణులను కొనుగోలు చేసి, వాటిని భారత సరిహద్దుల్లో మోహరించడం గురించి మాట్లాడాడు. పాకిస్తాన్‌కి చెందిన ఘోరీ స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తర బెంగాల్ వెంబడి చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లో ఉంచడం వల్ల భారత్‌పై నిరోధక ప్రభావం ఉంటుందని అన్నాడు. బంగ్లాదేశ్ కొన్ని భూభాగాలు స్వాధీనం చేసుకుని, ఈశాన్య రాష్ట్రాల్లో భాగం చేయాలని భారత్ కోరుకుంటోందని, దీనిని నిరోధించడానికి అణు ఒప్పందం, పాక్ నుంచి క్షిపణలు కొనుగోలు చేయడంలో పాకిస్తాన్ సాయం అవసరమని ఆయన అన్నారు. రిటైర్డ్ సైనికాధికారులు నిర్వహించిన సెమినార్‌లో సైనికాధికారులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్తాన్‌ని మిత్రుడిగా, భారత్‌ని ముప్పుగా పేర్కొన్నాడు.

Show comments