Site icon NTV Telugu

India Pakistan: ‘‘ మా నీరు ఆపితే, మీ గొంతు కోసి చంపేస్తాం’’.. ఉగ్రవాదిలా పాక్ ఆర్మీ అధికారి బెదిరింపులు..

Pak

Pak

India Pakistan: పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద భాష మారడం లేదు. భారత్‌ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా, పాక్ ఎయిర్ ఫోర్స్ ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయినా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదులు మాట్లాడే భాషలోనే అక్కడి ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు. గతంలో, సింధు జలాల నిలిపివేతపై లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీస్ సయీద్ మాట్లాడుతూ.. ‘‘మీ గొంతులు కోస్తాం’’ అని భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేశాడు.

Read Also: West Bengal: ‘‘ అమ్మా.. నేను దొంగని కాదు, చిప్స్ దొంగిలించలేదు’’.. 12 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్..

అయితే, ఇప్పుడు ఆ దేశానికి చెందిన సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ కూడా ఉగ్రవాద భాష మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మిమ్మల్ని గొంతు కోసి చంపేస్తాము’’ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తేనే ఒప్పందాన్ని మళ్లి పునరుద్ధరిస్తామని భారత్ స్పష్టం చేసింది.

గతంలో లష్కరే తోయిబా చీఫ్, ప్రమాదకర ఉగ్రవాది హఫీస్ సయీద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘మీరు నీటిని ఆపివేస్తే, దేవుడు కోరుకుంటే, మేము మీ శ్వాసను ఆపివేస్తాము, ఆపై ఈ నదులలో రక్తం ప్రవహిస్తుంది’’ అని ఓ బహిరంగ సభలో అన్నాడు. అఫ్ఘన్ రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియం సోలైమాంఖిల్ షరీఫ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘‘అతను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ చెప్పిన “భారతదేశం నీటిని ఆపివేస్తే మేము వారి శ్వాసను ఆపివేస్తాము” అనే మాటలను కాపీ చేసినట్లు అనిపిస్తుంది, పాకిస్తాన్ సైనిక వ్యవస్థ గుర్తింపు పొందిన ఉగ్రవాదులతో ఒక స్క్రిప్ట్‌ను పంచుకుంటుందని నేను అనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

Exit mobile version