Site icon NTV Telugu

PM Modi: అంబేడ్కర్ను గౌరవిస్తుంది కేవలం మేము మాత్రమే.. వాళ్ళది కపట ప్రేమ

Modi

Modi

PM Modi: డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో దేశ ప్రజలు చూశారని తెలిపారు.

Read Also: Spy Camera: యూపీలో టీచర్ల బాత్రూంలో స్పై కెమెరా.. స్కూల్ డైరెక్టర్‌ అరెస్ట్!

గత కొన్నేళ్ల పాటు కాంగ్రెస్‌ కొనసాగించిన అరాచకాలు, ముఖ్యంగా అంబేడ్కర్‌ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్ధాలతో వారు దాచలేరని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అలా అనుకుంటే వారు పెద్ద పొరబాటు చేసినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను ఎప్పటికి ఈ దేశ ప్రజలు మర్చిపోరని తెలిపారు. మనం ఇలా ఉండటానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కరే కారణం అని చెప్పుకొచ్చారు. గత దశాబ్దకాలంగా అంబేడ్కర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు మా సర్కార్ అవిశ్రాంతంగా కృషి చేసిందని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం గత 10 పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడంతో పాటు స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన లాంటి పథకాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడ్డాయని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Exit mobile version