Site icon NTV Telugu

BJP MLA: ‘‘మా వల్లే మీకు బట్టలు, చెప్పులు, ఫోన్లు’’.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Bjp Mla

Bjp Mla

BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్‌రావ్ లోనికర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జల్నా జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం పర్తూర్‌లో జరిగిన ‘‘హర్ ఘర్ సోలార్’’ పథకంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ , బీజేపీని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘తన పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు మా వల్లే బట్టలు, బూట్లు, మొబైల్స్, పథకాలకు సంబంధించి డబ్బు, విత్తనాల కోసం డబ్బు పొందుతున్నారు అని తెలుసుకోవాలి’’ అని అన్నారు.

Read Also: SCO Summit: “పహల్గామ్ వద్దు, బలూచిస్తాన్ ముద్దు”.. ఎస్‌సీఓ లో చైనా, పాక్ కుట్ర..

సోషల్ మీడియాలో మమ్మల్ని విమర్శించే వ్యక్తులు మీ గ్రామంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, కాంక్రీట్ రోడ్లు, ఫంక్షన్ హాల్స్, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఇచ్చామని గుర్తుంచుకోవాలని అన్నారు. ‘‘ మమ్మల్ని విమర్శించే వారికి కూడా బాబన్‌రావ్ లోనికర్ పథకాలకు డబ్బులు ఇచ్చారు. వారి తల్లిదండ్రులకు పెన్షన్లు ఇచ్చారు. ప్రధాని మోడీ మీ తండ్రికి విత్తనాలు వేయడానికి రూ. 6,000 ఇచ్చారు (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రస్తావన). మీ సోదరి లడ్కీ బహిన్ యోజన నుండి ప్రయోజనం పొందుతోంది. మీ (బీజేపీ విమర్శకులు) వద్ద ఉన్న బట్టలు, బూట్లు, మొబైల్ ఫోన్లు మా వల్లనే ఉన్నాయి’’ అని ఎమ్మెల్యే చెప్పడం వినవచ్చు.

అయితే, ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన (UBT) MLC, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకరంగా మాట్లాడారని విమర్శించారు. ఆయన బ్రిటీష్ వారి స్వదేశీ వెర్షన్ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష మాట్లాడటం సరికాదని చెప్పారు. మీ ఎమ్మెల్యే హోదా ప్రజల వల్లే వచ్చిందని, మీ బట్టలు, బూట్లు, విమాన టికెట్లు, మీ కారులో డిజిల్ ప్రజలు ఇచ్చినమే అని ఆయన అన్నారు.

Exit mobile version