Nitin Gadkari: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా మెమోరీ లాస్‌తో బాధపడుతున్నారు’’ అని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీశాయని, దీంతోనే మహారాష్ట్రలో అనుకున్న స్థాయిలో ఎన్డీయే ప్రదర్శన చేయలేకపోయిందని చెప్పారు. ‘‘మేము 400 సీట్లు గెలిస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరిస్తామని తప్పుడు కథనాలనున ప్రచారం చేశారు’’ అని దుయ్యబట్టారు.
Read Also: Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్చిన అఫ్కాన్ సంస్థ
రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని, బీజేపీ అలా ఎప్పటికీ చేయదని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం తప్పు అని ఇప్పుడు ప్రజలు గ్రహించారని, ప్రధాని మోడీ నాయకత్వంలోని మహాయుతికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని గడ్కరీ అన్నారు. యోగి ‘‘ బాటేంగే తో కటేంగే’’ గురించి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. మనమంతా ఒక్కటే.. కొందరు గుడికి, మరికొందరు మసీదు, గురుద్వారాలకు వెళ్తారు. కానీ మనమందరం భారతీయులం, దేశం మనకు అన్నింటికంటే ముఖ్యం ” అని అన్నారు.
రాహుల్ గాంధీ లేవనెత్తిన కులగణన గురించి ప్రస్తావిస్తూ.. అసలు సమస్య గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమమేనని, పేదలకు కులం, మతం ఉండవని, ముస్లింలకు ఇతరులతో సమానంగా పెట్రోల్ లభిస్తుందని గడ్కరీ అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా తాను ఇంతకుముందు పనిచేశానని, ఇప్పుడు ఆ పదవిపై కోరిక లేదని గడ్కరీ చెప్పారు.