Site icon NTV Telugu

Mumbai: మహిళా ఉద్యోగిపై వాచ్‌మన్ అత్యాచారయత్నం.. అరెస్ట్

Watchmen

Watchmen

ముంబైలో ఓ వాచ్‌మన్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. బ్రాండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారయత్నానికి పూనుకున్నాడు. మహిళ ఎదురు తిరగడంతో కత్తితో దాడికి యత్నించాడు. అదృష్టం కొద్ది ఆమె ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చేరింది. స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీహార్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో హింస.. రెండు రైళ్లు రద్దు చేసిన భారత్..

ఓ బంగ్లాలో మహిళ(38) నివాసం ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఆమెపై వాచ్‌మన్(28) సోమవారం అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడు కత్తితో ఆమెను బెదిరించి అఘాయిత్యం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో చంపే ప్రయత్నం చేశాడు. మెడ, చేతులకు గాయాలయ్యాయి. ప్రయత్నం ఫలించకపోవడంతో గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. స్నేహితుడి సాయంతో మొత్తానికి ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసలు.. బీహార్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..

Exit mobile version