NTV Telugu Site icon

Mahakumbh Mela: సీఎం యోగితో ఇటలీ బృందం భేటీ.. ఎంత చక్కగా “రామభజన” పాడారో చూడండి..

Mahakumbh Mela

Mahakumbh Mela

Mahakumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళకి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. కుంభమేళ ముగిసే నాటికి ఏకంగా 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి వస్తారని అంచనా. ఇటీవల ఇటలీకి చెందిన ఒక ప్రతినిధి బృందం కుంభమేళలో ‘‘కాలభైరవాష్టకమ్’’ పాడటం వైరల్‌గా మారింది. హిందూ ధర్మంపై వారికి ఉన్న భక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది.

Read Also: Rahul Gandhi: ‘‘భారత్ రాజ్యం’’పై నోరుజారిన రాహుల్ గాంధీ.. మరో కేసు నమోదు..

తాజాగా, ఇదే ఇటలీ బృందం సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ఆలపించిన ‘‘రామ్ భజన’’ వీడియో వైరల్‌గా మారింది. ఇటలీలోని మెడిటేషన్ మరియు యోగా కేంద్రం వ్యవస్థాపకుడు , శిక్షకుడు మహి గురూజీ తన అనుచరులతో కలిసి ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రయాగ్ రాజ్‌కి ఇటలీ నుంచి వచ్చిన మహిళలు సీఎం ముుందు రామాయణం, శివతాండవం, ఇతర అనేక భజనలను పారాయణం చేశారు.

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభ మేళ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం, జనవరి 18 వరకు త్రివేణి సంగమ ప్రదేశంలో 7.72 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరో 4 ముఖ్యమైన పవిత్ర స్నానాలు ఉన్నాయి, ఇవి జరిగే రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తదుపరి ముఖ్యమైన స్నాన తేదీలలో జనవరి 29 (మౌని అమావాస్య – రెండవ షాహి స్నాన్), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి – మూడవ షాహి స్నాన్), ఫిబ్రవరి 12 (మాఘి పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) రోజున ఉన్నాయి.