Site icon NTV Telugu

PM Modi: మోడీ పాదాలకు నమస్కరించిన హాలీవుడ్ సింగర్.. వీడియో చూడండి..

Pm Modi2

Pm Modi2

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఆశ్చర్యకర దృశ్యం ఆవిష్క్రతమైంది. ప్రఖ్యాత హాలీవుడ్ సింగర్, నటి మేరీ మిల్‌బెన్ ప్రధాని పాదాలకు నమస్కరించారు. ‘జన గణ మన’ జాతీయ గీతం పాడిన తర్వాతా ప్రధాని వద్దకు వెళ్లి మేరీ మిల్ బెన్, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 38 ఏళ్ల మిల్‌బెన్, వాషింగ్టన్ DCలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (USICF) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం మేరకు హాజరయ్యారు.

Read Also: Manipur Violence: మణిపూర్ హింసాకాండపై నేడు అమిత్ షా ఆల్ పార్టీ మీట్

ఈ కార్యక్రమంలో ఆమె జాతీయ గీతాన్ని ఆలపించారు. జనగణ మన, ఓం జై జగదీశే హరే పాటలను ఆమె పాడారు. ఈ రెండు కూడా ఇండియాలో చాల ఫేమస్ అయ్యాయి. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కోసం భారత దేశ జాతీయ గీతాన్ని ప్రదర్శించడం తనకు దక్కిన గౌరవం అని ఆమె అన్నారు.

వరుసగా నలుగురు అమెరికా అధ్యక్షుల కోసం అమెరికన్ జాతీయ గీతం, ప్రధాని మోడీ కోసం జాతీయ గీతాన్ని ప్రదర్శించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని.. దేశం, ప్రజల గౌరవార్థం నేను నా కుటుంబాన్ని కలుసుకునేందుకు వచ్చాని ఆమె అన్నారు. అమెరికా, భారత జాతీయ గీతాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ యెక్క ఆదర్శాలను తెలియజేస్తాయని.. ఇది అమెరికా-ఇండియా సంబంధాల సారాంశం అని ఆమె అన్నారు. స్వేచ్ఛ దేశ ప్రజలచే నిర్వచించబడుతుందని ఆమె అన్నారు. ప్రధాన మంత్రి అద్భుతమైన, దయగల వ్యక్తి అని.. ఆయన అమెరికా పర్యటనలో పాల్గొనడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు. సభలోని జనాలు కూడా జాతీయ గీతాన్ని పాడటం నాకు నచ్చిందని.. వారు పాడుతున్న సమయంలో వారి గొంతులో ఉద్వేగాన్ని వినొచ్చు అని ఆమె అన్నారు. గత నెలలో, ప్రధాని మోదీ పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా, ఆ దేశపు ప్రధాని గౌరవ సూచకంగా ప్రధాని మోదీ పాదాలను తాకారు.

Exit mobile version