Site icon NTV Telugu

Radhika Khera: రాహుల్ గాంధీ యాత్రలో నాకు మద్యం ఆఫర్ చేశారు.. కాంగ్రెస్‌పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు..

Radhika Khera

Radhika Khera

Radhika Khera: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న రాధికా ఖేరా ఆ పార్టీకి నిన్న రాజీనామా చేశారు. తాను అయోధ్యలో రాముడిని దర్శించుకున్నందుకు పార్టీలో చాలా మంది నాయకులు తనను వేధించారని ఆమె నిన్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అగ్రనాయకత్వానికి చెప్పినా కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమె సోమవారం మరోసారి కాంగ్రెస్ పార్టీ తీరుపై ఫైర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్‌పర్సన్ సుశీల్ అగౌరవంగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సచిన్ పైలట్, జైరాం రమేష్, భూపేష్ బాఘేల్, పవన్ ఖేరాలకు సమాచారం ఇచ్చారని పార్టీలో మగ దురహంకార మనస్తత్వాన్ని బయటపెడతానని ఖేరా అన్నారు.

తాను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసేందుకు మూడేళ్లుగా వారి టైం కోరుతున్నానని, కానీ వారెవరు నన్ను కలిసేందుకు ఒప్పుకోలేదని ఆమె అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్రలో ఎవరినీ కలవలేదని, ప్రజల వద్ద కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉండి, తర్వాత అతని వాహనంలోకి వెళ్లారని అన్నారు. అతను కేవల ట్రావెల్ వ్లాగర్ కావాలనుకున్నాడని ఎద్దేవా చేసింది.

Read Also: Bomb threats: అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..

ఈ విషయంపై తాను ఏ కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడినా, తనను మైనంగా ఉండమనే వారని, సుశీల్ ఆనంద్ అగౌరవంగా మాట్లాడిన విషయాన్ని మాజీ సీఎం భూపేష్ బఘేల్‌కి చెబితే తను ఛత్తీస్‌గఢ్ విడిచిపెట్టాలని కోరారని ఆమె ఆరోపించారు. సుశీల్ ఆనంద్ తనను అసభ్యకరమైన పదజాలంతో దూషిచారని, తన అనుచరులతో ఒక నిమిషం పాటు గదిలో బంధించినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంపై బఘేల్, పవన్ ఖేరా, సచిన్ పైలట్‌లకు సమాచారం అందించిన వారు తనకు సాయం చేయలేదని చెప్పారు.

జనవరి 22న జరిగిన అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎవరు తనకు సాయం చేయడానికి ముందుకు రాలేదని కన్నీరు పెట్టుకుంటూ రాధికా ఖేరా ఆరోపించారు. అయోధ్ సందర్శన తర్వాత పార్టీ తనను అవమానించిందని, భారత్ జోడో యాత్ర ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించిన తర్వాత సుశీల్ ఆనంద్ పదేపదే నాకు మద్యం ఆఫర్ చేశాడని ఖేరా ఆరోపించారు. సుశీల్ ఆనంద్‌తో పాటు 5-6 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మత్తులో తన గదిని కొట్టేవారని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినా పంచ కాంగ్రెస్ హిందూ, రాముడు వ్యతిరేక ఆలోచన ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు.

Exit mobile version