NTV Telugu Site icon

Mahua Moitra: ‘వారియర్స్ ఆర్ బ్యాక్’.. మహిళా ఎంపీలతో ఉన్న ఫొటో పోస్ట్

Mahua Moitra

Mahua Moitra

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్‌సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదిక ‘x’లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ‘యోధులు తిరిగి వచ్చారు’ అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్‌లు లోక్‌సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.

Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోడీ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్..

మహువా మొయిత్రా.. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కనిమొళి తమిళనాడులోని తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని బారామతి స్థానం నుండి సుప్రియా సూలే, తమిళనాడులోని చెన్నై సౌత్ వెస్ట్ కరూర్ నుండి తమిజాచి తంగపాండియన్, ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుండి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలుపొందారు. ఈ మహిళా ఎంపీలందరూ 18వ లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు.

Read Also: Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం

18వ లోక్‌సభలో మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఉంటే.. ఇప్పుడు మరో 4 తగ్గారు. మహిళా ఎంపీల పరంగా పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది. ఇక్కడ నుండి 11 మంది మహిళా ఎంపీలు విజయం సాధించారు. మరోవైపు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ నియామకం, పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విగ్రహాల స్థానభ్రంశం, నీట్ పేపర్ లీక్‌పై విపక్షాలు రచ్చను సృష్టిస్తూనే ఉన్నాయి.