War Effect: చెన్నైలో వదంతులు.. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు
- పశ్చిమాసియా యుద్ధంతో చెన్నైలో వదంతులు
- పెట్రోల్, డీజిల్ దొరకదంటూ పుకార్లు
- పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. భారత్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఇదే భయం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వైపు మళ్లింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో వాహనదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
వదంతులు వ్యాప్తి చెందడంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలో పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. దీంతో భారీ ఎత్తున క్యూ లైన్లు ఏర్పడ్డాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ వాహనదారులు మాట వినిపించుకోవడం లేదు. పెట్రోల్ ట్యాంక్‌లు ఫుల్ చేసుకోవడానికి తరలివస్తున్నారు.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
చెన్నై సిటీ, వేలచెరి, టీ నగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. ఎలాంటి కొరత లేదని సిబ్బంది చెబుతున్నప్పటికీ వాహనదారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముందస్తుగా ఫుల్ ట్యాంక్ నింపుకుని వెళ్తామంటూ ప్రజలు చెబుతున్నారు. అవసరానికి మించి అదనంగా కూడా తీసుకెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. కార్లు, బైకులు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
ఇది కూడా చదవండి: Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!