Site icon NTV Telugu

Waqf Act: బెంగాల్ దారిలో కర్ణాటక.. వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం..

Zameer Ahmed Khan

Zameer Ahmed Khan

Waqf Act: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్‌లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని కోరారు. తమ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించిందని, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఏదైనా ఉంటే కేంద్రంతో తేల్చుకోవాలని ఆందోళనకారులకు తెగేసి చెప్పారు.

Read Also: Falaknuma: పాతబస్తీలో నడిరోడ్డుపై రౌడీషీటర్‌ మాస్ యుద్ధీన్ దారుణ హ*త్య..

ఇదిలా ఉంటే, బెంగాల్ దారిలో కర్ణాటక ప్రభుత్వం కూడా నడుస్తోంది. కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయదని చెప్పారు. ‘‘మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందకూడదు కానీ, ఆమోదం పొందింది. మాకు కోర్టులో న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాము. కర్ణాటకలో దీనిని అమలు చేయము’’ అని అన్నారు.

ముర్షిదాబాద్‌లో జరిగిన హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించడం బాధగా ఉందని జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఆదివారం, మియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మహమూద్ మదానీ వక్ఫ్ చట్టాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ చట్టం సంస్కరణల ముసుగులో భూ ఆక్రమణల్ని సులభతరం చేసిందని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూకబ్జాదారులకు వక్ఫ్ ఆస్తులను సంపాదించడానికి ఈ చట్టం సహకరిస్తుందని ఆరోపించారు.

Exit mobile version