Site icon NTV Telugu

Congress: ‘‘ముస్లిం ఓట్లు కావాలి కానీ, అభ్యర్థులు వద్దా..?’’ కాంగ్రెస్‌ని ప్రశ్నించిన మైనారిటీ నేత..

Congress

Congress

Congress: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నేత సొంత పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ పార్టీ ప్రచార కమిటీ నుంచి వైదొలిగారు. ముస్లిం నాయకుల్ని పార్టీ నామినేట్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టనందున తాను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోనని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉంటే, ఎంవీఏ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని మాజీ మంత్రి లేఖలో పేర్కొన్నారు.

Read Also: Delhi : హోటల్‌లో 70 మంది పాకిస్థానీయులు.. మిలటరీ బలగాల మోహరింపు

మహారాష్ట్రలోని అనేక ముస్లిం సంస్థలు, నాయకులు కాంగ్రెస్ తరుపున ఒక్క మైనారిటీ అభ్యర్థినైనా ఎన్నికల బరిలో నిలబెడుతుందని అంతా భావించామని, అయితే ఇది జరగలేదని మహ్మద్ ఆరిఫ్ అన్నారు. కాంగ్రెస్‌కి ముస్లిం ఓట్లు కావాలి, కానీ అభ్యర్థులు ఎందుకు వద్దు..? అని అడుగుతున్నారు. ఈ కారణాల వల్ల నేను ముస్లింలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు.

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉంటే, ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహ్మద్ ఆరిఫ్ ఖాన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి టికెట్ ఆశించారు. అయితే, కాంగ్రెస్ ఈ టికెట్‌ని వర్షా గైక్వాడ్‌కి కేటాయించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని చండీవాలి నుంచి పోటీ చేసిన మహ్మద్ ఆరిఫ్ 409 ఓట్ల తేడాలో ఓడిపోయారు.

Exit mobile version