NTV Telugu Site icon

Sonam Wangchuk: కేంద్రం హామీతో వాతావరణ కార్యకర్త వాంగ్‌చుక్ దీక్ష విరమణ

Wangchuk

Wangchuk

డిసెంబరు 3న లడఖ్ గ్రూపులతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం తన నిరాహార దీక్షను ముగించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే కార్యకర్తలను కలుసుకుని హోంశాఖ నుంచి లేఖను అందజేశారు. ఢిల్లీలోని లడఖ్ భవన్‌లో వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. లడఖ్ గ్రూపులను కలవడానికి కేంద్రం అంగీకరించిన తర్వాత వాంగ్‌చుక్ ఉపవాస దీక్ష విరమించారు.

ఇది కూడా చదవండి: US: మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌లో ట్రంప్ సందడి.. ఏం చేశారంటే..!

లడఖ్ డిమాండ్లపై నిలిచిపోయిన చర్చలను డిసెంబర్‌లో కొనసాగిస్తామని కేంద్ర హామీ ఇవ్వడంతో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ , ఆయన అనుచరులు సోమవారం సాయంత్రం నిరాహారదీక్షను విరమించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌పై వాంగ్‌చుక్ తదితరులు అక్టోబర్ 6వ తేదీ నుంచి ఢిల్లీలోని లఢఖ్ భవన్‌లో నిరాహార దీక్ష సాగిస్తున్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ అగ్రనాయకత్వంతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూల సంకేతాలు పంపింది.

ఇది కూడా చదవండి: Unstoppable With NBK : ఆకాశంలో సూర్య చంద్రులు ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు

జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లఢఖ్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ లోఖాండే నేరుగా వాంగ్‌చుక్‌ను కలిసి హోం మంత్రిత్వ శాఖ లేఖను అందజేశారు. నిమ్మరసం అందజేసి దీక్షను విరమింప చేశారు. లఢఖ్ ప్రతినిధులతో మంత్రిత్వ శాఖ హైపవర్డ్ కమిటీ డిసెంబర్ 3న చర్చలు జరుపుతుందని ఆ లేఖలో హోం శాఖ తెలియజేసింది. దీక్ష విరమణ అనంతరం వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ అధికారులు, లఢఖ్ జాయింట్ సెక్రటరీ తమను కలిసి డిసెంబర్ 3న చర్చలకు సంబంధించి లేఖను అందించినట్టు చెప్పారు. తమ ప్రధాన డిమాండ్ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో నిలిచిపోయిన చర్చలు డిసెంబర్ 3న కొనసాగుతాయని, ఇరువర్గాల మధ్య చర్చలు నిజాయితీగా, సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.