NTV Telugu Site icon

Bihar: ప్రభుత్వ పాఠశాలలో అశ్లీల డ్యాన్స్‌లు.. మండిపడుతున్న ప్రజలు

Bihardance

Bihardance

బీహార్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్లబ్‌గా మారిపోయింది. పాఠశాలను బార్‌గా మార్చేసి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో అశ్లీల డ్యాన్స్‌లు చేయిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.  సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Netanyahu: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఓ వివాహ వేడుకకు ప్రభుత్వ పాఠశాలను కొందరు వ్యక్తులు తీసుకున్నారు. అయితే అది పాఠశాల అన్న విషయం మరిచిపోయి క్లబ్‌గా మార్చేశారు. బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చి అశ్లీల డ్యాన్సులు చేయిపించారు. భోజ్‌పురి పాటలకు నలుగురు మహిళలు అసభ్య నృత్యం చేశారు. కొంతమంది పురుషులు ఫుల్గా తాగి స్త్రీలతో కలిసి నృత్యం చేయడం కనిపించింది. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇస్తుందని ఆ ప్రాంత వాసులు ప్రశ్నించారు. ఇంకో వైపు మద్యం తాగుతూ రెచ్చిపోయారు. ఈ పరిణామంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ఇలాంటి వేడుకలకు పాఠశాలను ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు.  వైరల్‌ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు జలాయి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మమతా కుమారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ, మరదలికి పంచాయితీ షాక్..

 

Show comments