Site icon NTV Telugu

Venkaiah Naidu: చట్టసభల గౌరవాన్ని కాపాడండి..

చట్టాలు చేయాల్సిన సభల్లో విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి.. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చోట.. వాదోపవాదాలు సాగుతున్నాయి.. నిరసనలు, ఆందోళనలు, ఇలా అట్టుడికిపోతున్నాయి చట్ట సభలు.. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ప్రజా ప్రతినిధులు చట్టసభల గౌరవాన్ని కాపాడాలని సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలన్నారు.. చట్టసభల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలు, ఇతర పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్య.

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి పరారీ..?

విమర్శలు చేసేందుకు ప్రజాప్రతినిధులకు అన్ని రకాల హక్కులు ఉన్నాయన్న వెంకయ్యనాయుడు.. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను గౌరవించి, వాటి గౌరవాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉందన్న ఉపరాష్ట్రపతి, శాంతియుతమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ప్రజలు కోరుకున్న ఎవరికైనా అధికారాన్ని చేపట్టే హక్కు ఉంటుందని, అదే సమయంలో ప్రజలు అవకాశం ఇచ్చే వరకూ ఓపికతో ఎదురు చూడడం మంచిదని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Exit mobile version