మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ముంబైలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అలాగే సల్మాన్‌ఖాన్, షారూఖ్‌ఖాన్ సహా పలువురు సినీ ప్రముఖులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటు వేసిన అనంతరం అందరూ ఓటింగ్‌లో పాల్గొ్నాలని పిలుపు నిచ్చారు. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు 45 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటలకు ముగిసే నాటికి భారీగానే పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Inter Student Suicide: గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నించగా.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నం చేసింది. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఒరిజనల్ ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Winter: శీతాకాలంలో వ్యాయామం ఎలా చేయాలంటే..!