NTV Telugu Site icon

Aadhaar : ఆధార్​ అప్‌డేట్‌ చేయాల్సిందే..!

Aadhaar

Aadhaar

‘ఆధార్‌’ పై కీలక ఆదేశాలు జారీ చేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ).. అధికారిక మూలాల ప్రకారం, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్‌ చేయాలని పేర్కొంది.. ప్రస్తుతం, 5 మరియు 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది… కాగా ఇప్పుడు వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది యూఐడీఏఐ.. అయితే, 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్​ అప్​డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. మేఘాలయ, నాగాలాండ్​ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వయోజనుల ఆధార్​ కార్డులను అప్​డేట్​ చేశామని తెలిపారు. అయితే, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కారణంగా.. మేఘాలయలో ఈ ప్రక్రియ ఆలస్యంమైందని పేర్కొంది యూఐడీఏఐ.

Read Also: September 17 Special: సెప్టెంబర్ 17న అసలేం జరిగింది..?

వయోజన నివాసితులలో ఆధార్ సంతృప్త స్థాయిలో ఉందని.. 93.65 శాత మందికి ఆధార్‌ ఉందని పేర్కొంది.. ఇక, ఆగస్టులో కొత్తగా నమోదైనా ఆధార్‌ కార్డులు 24.2 లక్షలు మాత్రమేనని పేర్కొంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). అయితే, యూఐడీఏఐ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లను కలిగి ఉంది.. మరియు 1.5 లక్షల పోస్ట్‌మెన్‌లను ఆన్‌బోర్డ్ చేసే ప్రక్రియలో ఉంది, వీరు ఆధార్ హోల్డర్‌ల మొబైల్ నంబర్‌లు మరియు చిరునామాలను ప్రారంభంలో అప్‌డేట్ చేస్తారు… గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన వేదికపైకి తీసుకురావడానికి ఇది ఇప్పుడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది, ఎందుకంటే ఇది లబ్ధిదారుల నకిలీలను తొలగించడానికి, నిధుల లీకేజీలను నిరోధించడానికి, ప్రజా ధనాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.