NTV Telugu Site icon

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్.. ఖరారు చేసిన బీజేపీ

Chhattisgarh Cm

Chhattisgarh Cm

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఈ రోజు బీజేపీ కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన సర్బానంద సోనావాల్, అర్జున్ ముండాలు సీఎంను ఖరారు చేశారు. మొత్తం 90 అసెంబ్లీలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 54 స్థానాల్లో బీజేపీ గెలిచింది. గతంలో విష్ణు దేవ్ సాయ్ కేంద్రమంత్రిగా పనిచేశారు.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్.. ఖరారు చేసిన బీజేపీ

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం నిలుపుకోగా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా కూడా ఇంకా సీఎంలను ఖరారు చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ఎన్నికయ్యారు.

విష్ణు దేవ్ సాయ్ గురించి కీలక విషయాలు:

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి అసెంబ్లీ స్థానం నుంచి విష్ణు దేవ్ సాయ్ గెలుపొందారు. 87,604 ఓట్లతో విజయం సాధించారు. గిరిజన వ్యక్తిని సీఎంగా బీజేపీ ఎన్నుకుంటే.. తొలి ఛాయిస్ విష్ణు దేవ్ సాయ్ అని వార్తలు వినిపించాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయననే సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. సాయ్ మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో ఉక్కు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 16వ లోక్‌సభలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు.

అజిత్ జోగి తర్వాత ఛత్తీస్‌‌గఢ్ రాష్ట్రానికి సీఎం అవుతున్న రెండో వ్యక్తిగా విష్ణుదేవ్ నిలిచారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఛతీస్‌గఢ్‌ను మధ్యప్రదేశ్ నుండి వేరు చేయడానికి ముందు విష్ణు దేవ్ సాయి 1990-98 మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. విష్ణు దేవ్ 1999 నుండి 2014 వరకు రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం విష్ణు దేవ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వలేదు.

Show comments