Site icon NTV Telugu

Visa-Free Travel To Russia: భారతీయులకు శుభవార్త.. రష్యాకు వీసా ఫ్రీ ట్రావెల్

Modi, Putin

Modi, Putin

Visa-Free Travel To Russia: రష్యాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై రష్యా సందర్శించాలనుకుంటే వీసా రహితంగా సందర్శించే అవకాశం ఏర్పడింది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ప్రయాణ ఒప్పందం చర్చలోకి వచ్చింది. ఈ ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉజ్బెకిస్తాన్ లోని సమర్‌కండ్‌లో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్( ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇద్దరు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో భారతదేశం గొప్ప చరిత్ర, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయకంగా రష్యాకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీతో అన్నారు. ఈ నేపథ్యంలో వీసా ఫ్రీ ప్రయాణానికి సంబంధించిన ఒప్పందంపై చర్చల ప్రక్రియ వేగవంతం చేయాలని పుతిన్ ప్రతిపాదించారు.

Read Also: CM KCR : మోడీ మా జీవోను గౌరవిస్తావా.. దాన్నే ఊరితాడు చేసుకుంటావా..?

రష్యా, ఇండియా దశాబ్ధాలుగా కలిసి ఉన్నాయని.. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులును తరలించేందుకు సహకరించినందుకు పుతిన్ కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాని మోదీ, పుతిన్ తో అన్నారు. దీనిపై మీ ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని.. త్వరలోనే దీనికి ముగింపు పలుకుతామని రష్యా ప్రెసిడెంట్ పుతిన్, మోదీతో అన్నారు.

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాత్రం రష్యాతో తన సంబంధాలను కొనసాగిస్తుంది. రష్యాతో చమురుతో పాటు ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఆంక్షల మధ్య భారత్ తో రష్యా చేస్తున్న వాణిజ్యం ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై పాశ్చాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. భారత్ మాత్రం తమ ప్రజల ప్రయోజనాలకే మొగ్గు చూపుతామని పలు సందర్భాల్లో చెప్పింది.

Exit mobile version