NTV Telugu Site icon

Virender Sehwag: మనసున్నోడు మా వీరు.. రైలు ప్రమాదంలో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య

Train Accident

Train Accident

Virender Sehwag: ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన అందర్ని కలిచి వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 270కి పైగా మంది చనిపోయారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ ప్రమాదంపై సెలబ్రెటీలు చలించిపోతున్నారు. వివిధ దేశాని నేతలు, ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించడంతో అనాథలుగా మిగిలిన పిల్లలకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also: Maruti Suzuki Jimny: రేపు లాంచ్ కాబోతున్న మారుతి సుజుకీ జిమ్నీ..

ఇప్పటికే ప్రముఖ బిలియనీర్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు. ఉచితంగా విద్యను అందిస్తానని ప్రకటించారు. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అనాథలైన పిల్లలను అదుకునేందుకు ముందుకు వచ్చారు. తన స్కూల్ లో ఉచితంగా విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ చిత్రం చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద సమయంలో, ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడమే నేను చేయగలిగింది. నేను అలాంటి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ సదుపాయంలో ఉచిత విద్యను అందిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు- షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్, ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. మూడు దశాబ్ధాల రైల్వే చరిత్రలో ఇదే అత్యంత పెద్ద ప్రమాదంగా నిలిచింది. మరోవైపు ఈ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది.

Show comments