NTV Telugu Site icon

Viral News : బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. చివరికి లెటర్ తో..

Women Hostel

Women Hostel

ఈ మధ్య కాలంలో యూత్ కు, ఫోన్ కు విడదీయని బంధం ఉంది.. కనీసం బట్టలు వేసుకోకుండా అయినా ఉంటారు కానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం ఒక్కరు కూడా ఉండరు.. చివరికి ఎలా తయారైయ్యారంటే అక్కడకు కూడా ఫోన్లను వదలడం లేదు అంటే నమ్మండి.. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్‌రూమ్‌లో పాటలు వినడమే పాపం అయ్యింది.. చివరికి క్షమాపణలు చెప్పినా కూడా వదల్లేదు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వివాల్లోకి వెళితే.. కేరళ లోని కూవపల్లిలో అమల్ జ్యోతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌ విద్యార్థిని.. హాస్టల్‌లో ఉంటోంది. అయితే, స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో వెంట మొబైల్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లింది. పాటలు వింటూ యువతి స్నానం చేసింది. ఆమె అలా చేయడమే ఇక్కడ నేరమైంది. హాస్టల్ సిబ్బంది ఆమె మొబైల్‌ ను లాక్కోవడమే కాకుండా నాదే తప్పు అంటూ క్షమాపణలు కూడా చెప్పించుకోవడమే కాదు.. ఆఖరి కి కాళ్లు పట్టుకున్న కూడా అస్సలు వదల్లేదు..

విషయానికొస్తే.. బాత్రూమ్‌ లో మొబైల్‌లో పాటలు వింటూ స్నానం చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతాను.. నాకు ఫోన్ నాకు ఇవ్వండి ప్లీస్ అంటూ విన్నవిస్తూ మరి ఒక లెటర్ తో సారీ చెప్పినా హాస్టల్ వార్డెన్‌ను వినలేదు.. అంతేకాదు యువతి క్షమాపణ లేఖ రాయడంతో పాటు.. ఆ లేఖ పట్టుకుని నిల్చోగా ఫోటో కూడా తీశారు. ఈ ఫోటో, లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.. ఇది 2022 లో చోటు చేసుకున్న ఘటన కాగా, ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. ఈ లేఖను చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. హాస్టల్‌ లో ఇంతటి కఠిన ఆంక్షలు అవసరం లేదని మండిపడుతున్నారు.. అంతేకాదు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..

Show comments