NTV Telugu Site icon

Vinesh Phogat: వినేష్ ఫోగట్ అనర్హతపై కేంద్ర క్రీడల మంత్రి కీలక ప్రకటన..

Vinesh Phogat

Vinesh Phogat

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్‌కి గురైంది. దీంతో ఆమె ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఐఓఏ చీఫ్ పీటీ ఉషను ఆదేశించారు. ప్రతిపక్షాల ఆందోళన, కుట్ర దాగుండనే అనుమానాల మధ్య కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ ఈ రోజు లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.

Read Also: Harish Rao: రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి..

ఫోగాట్‌కి అసవసరమైన అన్ని రకాల సహాయాలని ప్రభుత్వం అందించినపట్లు వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని ప్రకటనలో తెలియజేవారు. ‘‘భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుండి అనర్హుడయ్యారు. వినేష్ 50 కిలోల విభాగంలో ఆడుతున్నాడు, పోటీకి ఆమె బరువు 50 కిలోలు ఉండాలి. UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) నియమాలు మరియు నిబంధనల ప్రకారం, అన్ని పోటీల కోసం, సంబంధిత కేటగిరీల్లో ప్రతిరోజూ ఉదయం బరువులు నిర్వహిస్తారు’’ అని మాండవీయ అన్నారు.

‘‘ఆగస్టు 7, 2024న, 50 కిలోల మహిళల రెజ్లింగ్‌ పోటీకి సంబంధించి రెజ్లర్‌లకు పారిస్ టైమ్ 7:15-7:30 గంటల బరువు నిర్ణయించబడింది. వినేష్ బరువు 50 కిలోల 100 గ్రాములుగా ఉన్నట్లు గుర్తించబడ్డారు. అందువల్ల, ఆమె పోటీకి అనర్హులుగా ప్రకటించారు’’ అని ఆయన సభలో వెల్లడించారు. మంగళవారం వినేష్ ఫోగట్ ఒలింపిక్‌ ఫైనల్ చేరుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనే ముందు ఆమె బరువు నిబంధనల కన్నా 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో దురదృష్టవశాత్తు అనర్హత కారణంగా ఆమె ఏ పతకం గెలుచుకోలేదు.