Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు కుట్ర కేసు..
- ప్రభుత్వం కూల్చేందుకు ఏకంగా రూ.180 కోట్ల కేటాయింపు..
- గిండిలోని ఓ హోటల్ వేదికగా కార్పొరేట్ సంస్థ వ్యూహరచన..
- పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన సంచలన నిజాలు..
- హోటల్లో వారం రోజుల పాటు బస చేసినట్టు నిందితుల గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చివేత చేసిన కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్ర వెనుక ఏకంగా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారని, ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీనికి సంబంధించిన వ్యూహరచన చేసిందని తెలుస్తోంది. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నిందితులను విచారించగా ఈ నిజాలు బయటపడ్డాయి. స్థానిక గిండిలోని ఒక హోటల్‌ను ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. కార్పొరేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి తాము కూడా అక్కడ వారం రోజుల పాటు బస చేసి, వ్యూహాలు సిద్ధం చేసినట్లు వారు అంగీకరించారు.
ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబర్ తిరునావుక్కరసుతో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడు అశోక్ కుమార్ కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. వారి ఆదేశాల మేరకే తాము ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు సహకరిస్తే రూ.35 కోట్లు ఇస్తామంటూ ఒక యూట్యూబర్ తనను సంప్రదించాడని టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఇప్పటి వరకు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు వర్గాలు ఈ కుట్రకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఆ కార్పొరేట్ సంస్థ ఏది అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!