Site icon NTV Telugu

Vijay: తమిళనాడులో అధికారంలోకి వచ్చేది టీవీకేనే..

Vijay

Vijay

కాన్ఫిడెంట్‌గా ఉండండి వచ్చే ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)దే విజయం అని ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ అన్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు విజయ్, ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడారు. హిందీపై డీఎంకే-బీజేపీ పార్టీలు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు కొట్టుకున్నట్లు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. రెండు పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి సోషల్ మీడియా హ్యాస్ ట్యాగ్ ట్వీట్‌లు వేసుకుంటూ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు రావడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. రెండు పార్టీలు కొట్టుకున్నట్లు నటిస్తే మనం నమ్మాలి.. ప్రజలు నమ్మాలని అనుకుంటున్నారన్నారు. ‘‘వాట్ బ్రో ఇట్స్ వెరి రాంగ్ బ్రో అంటూ బీజేపీ, డీఎంకేపై విజయ్ సైటర్ వేశారు. ప్రజలకు ఈ రెండు పార్టీల నాటకాలు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఇది కూడా చదవండి: Aadhi Pinisetty : విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన యంగ్ హీరో..

‘‘దేశంలో ఎవరైనా ఏ భాషనైనా చదువుకోవచ్చు. ఆత్మగౌరవాన్ని ఎవ్వరి కోసం వదులుకోకూడదు. నేను పార్టీ పెట్టడం ఒకరి ఇద్దరికి ఇబ్బంది గానే ఉంటుంది. నా పార్టీ క్లోజ్ చేయాలని రకరకాల ప్లాన్ వేస్తున్నారు. చివరికి ఏమీ చేయలేక.. సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు రాజకీయ పార్టీ పెడతారని సెటైర్లు వేస్తున్నారు‌. నా పార్టీలో ఉన్నది అందరూ చిన్నవాళ్లు.. సామాన్యలే అంటున్నారు.. అయితే ఏంటంటా? అన్నాదొరై, ఎంజీఆర్ వెంట ఉన్నది వారే కదా?, నా పార్టీలో ఉన్నది సామాన్యులు, మధ్య తరగతి వారే, వారితోనే గెలుస్తాను‌‌. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి.. ప్రతి కార్యకర్త ప్రజలు కోసం యుద్ధం చేయాలి. ఇప్పుడున్న నేతలకు ఏ రూపంలో డబ్బులు దోచుకుందామా అని చూస్తున్నారు‌‌. 69 వేల బూత్ ఏజెంట్లను నియమిస్తాను. బూత్ కమిటీలతో మహానాడు నిర్వహిస్తా. ఆరోజే తెలుస్తుంది టీవీకే పార్టీ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తెలుస్తుంది.’’ అని విజయ్ అన్నారు.

ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna : బసవతారకం ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం

Exit mobile version