Site icon NTV Telugu

Vijay Rupani: రెండుసార్లు ఫ్లైట్ టికెట్ క్యాన్సల్.. మూడోసారి మృత్యువు ఒడిలోకి..

Vijay Rupani

Vijay Rupani

Vijay Rupani: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, రూపానీ రెండు సార్లు తన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి మాత్రం ప్రమాదంలో మరణించారు.

Read Also: Free Bus Effect: ఉచిత బస్సు ఆడవాళ్లకు.. డ్రైవర్లు, కండక్టర్లకు ఫ్రీగా దెబ్బలు!

నిజానికి రూపానీ తన భార్య, పిల్లలని కలిసేందుకు ఎయిరిండియా ప్రమాదం జరిగిన జూన్ 12న లండన్ వెళ్లాలని అనుకోలేదు. మే 19న AI171 విమానంలో టికెట్ బుక్ చేసుకుని జూన్ 25న భారతదేశానికి తిరిగి రావాలని అనుకున్నారు. ప్రణాళికల్లో మార్పుతో రూపానీ మే 19 టికెట్ రద్దు చేసుకున్నారు. మరోసారి జూన్ 5న లండన్ వెళ్లాలని అనుకున్నారు. రెండో సారి కూడా ఫ్లైట్ టికెట్ రద్దు చేసుకున్నారు.

చివరకు జూన్ 12న ఎయిరిండియా AI 171లో సీటు నంబర్ 2డీ బుక్ చేసుకున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం లోపే కూలిపోయింది. ‘1206’ నెంబర్‌ని రూపానీ లక్కీ నెంబర్‌గా భావిస్తారు. జూన్ 12 (12/06)న ప్రమాదంలో మరణించారు. చివరకు లక్కీ నెంబర్ కూడా ఆయనను విధి నుంచి తప్పించలేకపోయింది..

Exit mobile version