Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Vijay Opposes Delimitation Bill 2026 Tamil Nadu Representation Concerns

Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

Published Date :April 15, 2026 , 3:21 pm
By Suresh Maddala
  • డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం
  • ఇప్పటికే కేంద్ర సాయం విషయంలో నష్టపోతున్నాం
  • పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అయితే డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ‘‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026’’ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యలో పెద్ద మార్పు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లుపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది.

తాజాగా ఇదే అంశంపై టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక ప్రకటన విడుదల చేశారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనలు పక్షపాత చర్యగా అభివర్ణించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తమిళగ వెట్రి కళగం (TVK) స్వాగతిస్తోందని.. కానీ ఈ సవరణ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణ-ఉత్తర రాష్ట్రాల మధ్య ప్రతినిధిత్వ అసమానత మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సవరణ బిల్లుతో దక్షిణ రాష్ట్రాల్లో ప్రతినిధిత్వం తగ్గిపోతుందని.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కులు, కేంద్ర విధానాల రూపకల్పనలో దక్షిణ రాష్ట్రాల స్వరం బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఘోరంగా దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. బిల్లు ఆమోదం పొందితే కేంద్ర విధానాలను అనుసరించే రాష్ట్రాలకు ఇది ‘‘శిక్ష’’గా ఉంటుందన్నారు. అనుసరించని రాష్ట్రాలకు మాత్రం ‘‘ప్రోత్సాహం’’గా మారుతుందని విమర్శించారు. అదే విధంగా పార్లమెంట్ నియోజకవర్గాల మార్పులు ఆర్థిక పంపిణీపై కూడా తీవ్ర ప్రభావం చూపవచ్చని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం కేంద్రం నుంచి అందే ఆర్థిక సాయం విషయంలో నష్టపోతుందని ఆరోపణలు ఉన్నాయని.. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తగిన నిధులు, ప్రాజెక్టులు లభించడం లేదని చెప్పారు. డిలిమిటేషన్ తర్వాత జనాభా ఆధారిత పథకాల కింద రాష్ట్రానికి వచ్చే నిధులు మరింత తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026”ను ఉపసంహరించుకోవాలని.. ప్రస్తుత వ్యవస్థనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు.

Tamil Nadu | TVK President Vijay releases a statement on the issue of delimitation. He says, "Delimitation is a biased action by the Union Government".

"The Union Government, through the “Constitution (131st Amendment) Bill, 2026,” has proposed a significant change in the…

— ANI (@ANI) April 15, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delimitation Bill 2026 India
  • delimitation controversy India
  • Lok Sabha seat increase 850
  • Parliament special session India
  • south vs north states India

తాజావార్తలు

  • Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

  • Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!

  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..

  • Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

  • Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions