Vijay Emerges as King: అందరూ కింగ్‌మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
Vijay Emerges as King: తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన తలపతి విజయ్, తన తొలి ఎన్నికలతోనే భారీ ప్రభావం చూపిస్తున్నారు. చాలామంది ఎగ్జిట్ పోల్స్ ఆయన పార్టీ టీవీకేను కింగ్‌మేకర్‌గా అంచనా వేసినా, ఒకే ఒక సంస్థ Axis My India మాత్రమే విజయ్ మెజారిటీకి చేరువవుతారని ధైర్యంగా చెప్పింది. అంటే.. ఆయన కింగ్ మేకర్ కాదు.. కింగ్ అని పేర్కొంది.. ఇప్పుడు వెలువడుతున్న ట్రెండ్స్ ఆ అంచనాలను నిజం చేసేలా కనిపిస్తున్నాయి.
టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే పార్టీలను సవాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. తొలి ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా హంగ్ అసెంబ్లీ వస్తుందని, విజయ్ కింగ్‌మేకర్ పాత్రలో నిలుస్తారని అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకేకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ఆ అంచనాలను దగ్గరగా ప్రతిబింబిస్తున్నాయి. మరోవైపు, ఇతర సంస్థలు విజయ్ పార్టీకి కేవలం 10 నుంచి 26 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం గమనార్హం.
Also Read
- Mamata Banerjee: "ఓట్లను దోచుకున్నారు".. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
- West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
- Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
- BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
ఇదే సమయంలో డీఎంకే వ్యూహం విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తన నియోజకవర్గంలో వెనుకబడుతున్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. మరోవైపు, ఏఐఏడీఎంకే అంచనాల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తోంది. విజయ్ రాజకీయ ప్రయాణం చాలా మందికి గతంలోని మహానేతలను గుర్తు చేస్తోంది. ముఖ్యంగా ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు మాదిరిగా ప్రజాదరణతో రాజకీయాల్లో ఎదుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా కూడా విజయ్ ప్రదర్శనలో ఆ తరహా ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు.
విజయ్ విజయానికి ప్రధాన కారణాలు..
విజయ్ విజయానికి ప్రధాన కారణాల్లో యువత, మహిళల మద్దతు కీలకంగా నిలిచింది. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు పెద్ద ఎత్తున టీవీకేకు మద్దతు ఇచ్చారని అంచనా. మహిళా ఓటర్లలో కూడా పార్టీకి గణనీయమైన ఆదరణ లభించినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, గెలిచిన అభ్యర్థులను ఒకేచోట ఉంచేందుకు విజయ్ ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించడం, రాజకీయ అనుభవాన్ని చూపుతోంది. మొత్తానికి, “కింగ్‌మేకర్”గా భావించిన విజయ్ ఇప్పుడు “కింగ్” అవుతారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక పెద్ద శక్తిగా అవతరించారు.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Mamata Banerjee: “ఓట్లను దోచుకున్నారు”.. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
-
Vijay Emerges as King: అందరూ కింగ్‌మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
-
West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
-
Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
-
Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!