NTV Telugu Site icon

Golden Temple: అమ్మాయి ముఖంపై భారత జెండా..స్వర్ణదేవాలయంలోకి అనుమతి నిరాకరణ..

Golden Temple

Golden Temple

Golden Temple: పంజాబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కారణంగా దేశవ్యాప్తంగా పంజాబ్ లోని పరిస్థితులు చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం ఇప్పుడు చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలోకి వెళ్లేందుకు ఓ అమ్మాయికి అనుమతి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఆమె తన ముఖంపై భారతదేశ జాతీయ పతాకాన్ని కలిగి ఉండటమే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Read Also: Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని…

సిక్కుల పవిత్ర స్థలం అయిన స్వర్ణదేవాలయం వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. స్వర్ణదేవాలయం ఆవరణలో ఉన్న గార్డు ఆమెను లోపలికి అనుమతించలేదు. యువతికి సపోర్టుగా వచ్చిన యువకుడు ఇది భారతదేశం కాదా..? అని ప్రశ్నిస్తే గార్డు దురుసుగా ఇది పంజాబ్ అనడం వీడియోలో వినిపిస్తుంది. ఇదంతా ఆ యువతి సెల్ ఫోన్ లో రికార్డ్ అయింది. మహిళ ఇది భారత్ కాదా అని పదేపదే అడుగుతున్నప్పుడు, సదరు గార్డు కాదన్నట్లుగా తల ఊపడం గమనించవచ్చు. గార్డు వింతగా ప్రవర్తిస్తున్నాడని మహిళ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడంతో వీడియో ఎండ్ అవుతుంది.

గోల్డెన్ టెంపుల్‌ను నిర్వహించే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ, అధికారి దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే దీనిపై విరమరణ కూడా ఇచ్చింది. యువతి ముఖంపై ఉన్న జెండా భారత జెండా కాదని, దాంట్లో అశోక చక్రం లేదని ఇది రాజకీయ జెండా కావచ్చని పేర్కొంది. ఇది సిక్కుల పుణ్యక్షేత్రం అని ప్రతి మతస్థలానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయని, ప్రతీ ఒక్కరిని స్వాగతిస్తున్నామని ఒక అధికార తప్పుగా ప్రవర్తిస్తే క్షమాపణలు కోరుతున్నామని ఆలయ ప్రధాన కార్యదర్శ గురు చరణ్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.

Show comments