Site icon NTV Telugu

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వరదలు.. నీళ్లలో విమానాలు

Kolkataairport

Kolkataairport

కోల్‌కతాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎయిర్‌పోర్టులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో భారీ ఎత్తున విమానాశ్రయంలో నీళ్లు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని వరద ముంచెత్తింది. ఎయిర్‌పోర్టులో నీళ్లు నిలిచినా కూడా విమాన సర్వీసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫుటేజీలో రన్‌వే,టాక్సీవేలు రెండూ జలమయమయ్యాయి.

ఇది కూడా చదవండి: Nutan Naidu: కాంగ్రెసులో చేరిన బిగ్ బాస్ నూతన్ నాయుడు

కోల్‌కతా దాని పరిసర ప్రాంతాలైన హౌరా, సాల్ట్ లేక్ మరియు బరాక్‌పూర్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది. వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం.. ఈ అల్పపీడనం ప్రస్తుతం బీహార్.. ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాలపై ఈ ప్రభావం కనిపించనుంది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హౌరా, పశ్చిమ్ బర్ధమాన్, బీర్భూమ్, పుర్బా బర్ధమాన్, హుగ్లీ, నదియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో సహా దక్షిణాది జిల్లాల్లో రానున్న 12 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో చీలమండల లోతు నీరు ఉంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ శుక్రవారం కోల్‌కతాలో గరిష్ట ఉష్ణోగ్రత 30.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 2.4 డిగ్రీలు తక్కువగా నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సాధారణ స్థాయి కంటే 0.6 డిగ్రీలు తక్కువగా నమోదైంది.

ఇది కూడా చదవండి: Vemula Prashanth Reddy: రేవంత్ది ప్రజాపాలన కాదు.. ప్రతి పక్షాలపై పంజా విసిరే పాలన

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు హెచ్చరికలు జారీ చేసింది. కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని గంగానది జిల్లాల్లో 11 సెంటీమీటర్ల వరకు భారీ వర్షం కురుస్తుందని ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది. పురూలియా, ముర్షిదాబాద్, మాల్దా, కూచ్‌బెహార్, జల్‌పైగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. అలీపుర్‌దూర్ జిల్లా ‘రెడ్’ అలర్ట్‌ను ప్రకటించింది. 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Exit mobile version