Bihar: తల్లికి మించిన యోధులు లేరు..ఓ సినిమాలోని డైలాగ్. నిజజీవితంలో కూడా తల్లి తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పెంచిపెద్ద చేసి ప్రయోజకులుగా మారుస్తుంది. తన పిల్లలను కాపాడుకునే విషయంలో మృత్యువుకు కూడా అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటుంది.
సరిగా ఇలాంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో జరిగింది. తన పిల్లల్ని రక్షించుకునేందుకు వారిపై పడుకుని రైలు ప్రమాదం నుంచి రక్షించింది. వెంట్రుకవాసిలో మరణం ముందున్న కూడా పిల్లల్ని కాపాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రంలోని బార్హ్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కింద పడిన పిల్లలను కాపాడుకునేందుకు తన ప్రాణాన్ని అడ్డేసింది ఆ తల్లి. ఈ ఘటన శనివారం జరిగింది.
Read Also: Salaar Collections: 300 కోట్లు… సెకండ్ డే కూడా సలారోడు సెన్సేషన్ క్రియేట్ చేసాడు
మహిళ, ఆమె పిల్లలు బెగుసరాయ్ నుంచి వచ్చారు. మహిళ తన కుటుంబంతో ఢిల్లీకి వెళ్లేందుకు భాగల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లే విక్రమశిలా ఎదురుచూస్తోంది. ఈ లోపు ట్రైన్ రావడంతో ఒక్కసారిగా జనాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పిల్లలతో సహా మహిళ ట్రైన్ కింద పడింది. ప్లాట్‌ఫామ్, ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో ట్రైన్ కదలడంతో ఒక్కసారిగా తన పిల్లలకు ఏం కాకూడదని వారిపై పడుకుని, ట్రైన్‌కి పిల్లలకు మధ్య అడ్డుగోడలా నిలిచింది.
ట్రైన్ కింద పడిపోవడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ట్రైన్ మూవ్ కావడంతో తన పిల్లల్ని, తల్లి తన శరీరంతో కప్పి ఉంచింది. ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత మహిళను, పిల్లల్ని స్థానికులు రక్షించారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
मौत के सामने जीती मां की ममता. #Bihar के #Barh रेलवे स्टेशन से वीडियो. भीड़ में मां, दो बच्चों संग पटरी पर गिरी. ट्रेन चलने लगी. 3 जिंदगियों के सामने मौत खड़ी थी. और दूसरी तरफ मां. उधर ट्रेन की रफ्तार थी. तो इधर मां की ममता. 25 सेकेंड बाद मां जीती. मौत हारी. #viralvideo #barh pic.twitter.com/bsDxbD0EFS
— Sunil Maurya (@smaurya_journo) December 24, 2023