రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి సలార్ సీజ్ ఫైర్ సినిమాతో బాక్సాఫీస్ పునాదులు కదిలించే పనిలో పడ్డారు. డే 1 నైజాం, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ కి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాడు సలార్. ఈ దేవరథ రైజార్ చేసిన విధ్వంసానికి వరల్డ్ వైడ్ డే 1 ఆల్మోస్ట్ 180 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. 2023లో ఇండియాస్ టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని రాబట్టిన సలారోడు, డే 2కి మాస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అన్ని సెంటర్స్ స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ ని సీజ్ చేస్తూ డే 2 117 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో సలార్ సినిమా 295.7 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది.
Read Also: TheyCallHimOG: ఎందుకురా.. ట్రెండ్ చేస్తున్నారు
వరసగా రెండు రోజులు వంద కోట్ల ఓపెనింగ్ ని అత్యధిక సార్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేసాడు. ఇండియన్ బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా నిలిచిన ప్రభాస్… డే 3 సండే కావడంతో 150 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా ఉన్నాడు. బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే డే 2 కన్నా డే 3 ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మాములుగా అయితే మండే వర్కింగ్ డే కాబట్టి సినిమాల కలెక్షన్స్ కాస్త డౌన్ అవుతాయి, సలార్ విషయంలో ఇలా జరిగేలా కనిపించట్లేదు. సలార్ సినిమాకి క్రిస్మస్ హాలిడే కలిసొచ్చింది. క్రిస్మస్ హాలిడే కాబట్టి సలార్ మండే కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేయనున్నాడు. మండే ఎండ్ అయ్యే టైమ్ కి హోంబలే నుంచి 500 కోట్ల పోస్టర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
𝑻𝒉𝒆 𝑯𝒖𝒏𝒕𝒊𝒏𝒈 𝑺𝒆𝒂𝒔𝒐𝒏 𝑩𝒆𝒈𝒊𝒏𝒔…🔥💥#SalaarCeaseFire dominates the global-box office, crossing 𝟐𝟗𝟓.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟐 𝐃𝐚𝐲𝐬!#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/suEQftytyj
— Salaar (@SalaarTheSaga) December 24, 2023