Site icon NTV Telugu

Viral video: మహిళ సైకో ప్రవర్తన.. విద్యార్థులు తయారు చేసిన ఓనం అలంకరణ ధ్వంసం

Happyonam

Happyonam

ఓనం పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Breaking News: పోలీసులపై కాల్పులు జరిపిన అత్యాచార నిందితుడు.. ఏమైందంటే?

కేరళలో ఓనం పండుగ సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే బెంగళూరులోని నివాస సముదాయంలో పిల్లలు ఓనం పండుగ స్వాగత ఏర్పాట్లను పుష్పాలంకరణతో అలంకరించారు. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సిమి నాయర్ అనే మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ఇళ్లల్లో కాకుండా.. ఇలా నలుగురు తిరిగే అపార్ట్‌మెంట్లలో ఎలా ఏర్పాటు చేస్తారంటూ గొడవకు దిగింది. అంతేకాకుండా ఆ పుష్పాలంకరణను కాళ్లతో ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Dissanayake: ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఏకీభవిస్తున్నా..

మహిళ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓనం పండుగ సంప్రదాయాన్ని ఎందుకు గౌరవించలేదని నిలదీశారు. ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేసినందుకు ఆమెపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయ సంస్కృతిని గౌరవించకుండా పిచ్చిగా ప్రవర్తించిందని మరొకరు దుమ్మెత్తిపోశారు. ఇతరుల ఆనందాన్ని చెడగొట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. కేసు పెట్టాలని ఇంకొకరు పేర్కొన్నారు.

Exit mobile version