ఓనం పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.