Site icon NTV Telugu

Barber: ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్.. వీడియో వైరల్ కావడంతో పరార్..

Barber

Barber

Barber: తినే ఆహరంలో, కూల్‌డ్రింక్స్‌లో కొందరు పైశాచిక ఆనందం కోసం ఉమ్మేయడం చూశాం. ఇప్పుడు ఓ బార్బర్ తన కస్టమర్‌ ముఖానికి మసాజ్ చేస్తున్న సమయంలో ఉమ్మిని ఉపయోగించిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ కనౌజ్‌కి చెందిన ఓ సెలూన్‌లో బార్బర్ కస్టమర్ ముఖానికి ఉమ్మిని రాసిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నిందితుడైన బార్బర్‌ని యూసుఫ్‌గా పోలీసులు గుర్తించారు. కళ్లు మూసుకుని ఉన్న కస్టమర్ ముఖానికి తన ఉమ్మిని రాసి మసాజ్ చేస్తున్న వీడియో కనిపించింది.

Read Also: Anupama: అనుపమ పరమేశ్వరన్ క్రేజ్.. పడిపోయిన వృద్ధురాలు

కస్టమర్ కళ్లు మూసుకుని ఉన్న సమయంలో ముఖానికి క్రీమ్ రాసి, దానిని తడిపేందుకు తన ఉమ్మిని చేతిలోకి తీసుకుని కస్టమర్ ముఖానికి రాయడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో దాదాపుగా 10 రోజలు కిందదని తేలింది. ఈ వీడియో వైరల్ కావడంతో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యకర్తలు నిందితుడు యూసుఫ్‌పై నిరసనకు దిగారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతరం యూరఫ్ పరారీలో ఉన్నాడు. ఎస్పీ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు దానిని గమనించి కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాడు జూన్ నెలలో లక్నోలో ఓ సెలూన్‌లో ఉమ్మితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేసిన వీడియో సీసీటీవలో రికార్డ్ అయింది. సంబంధిత బార్బర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version