NTV Telugu Site icon

LK Advani: ఎల్‌కే. అద్వానీ హెల్త్ అప్‌డేట్ విడుదల!

Lkadvani

Lkadvani

రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్ర నేత ఎల్‌కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 12న ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అద్వానీ చేరారు. అనారోగ్యం కారణంగా ఐసీయూలో ఉంచినట్లు డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. వినిత్ సూరి సంరక్షణలో అద్వానీ కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం క్రమంగా కుదిటపడుతోందని.. త్వరలోనే నార్మల్ వార్డుకు తరలిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: HMDA: సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ

ఈ ఏడాది ఆగస్టులో అద్వానీ సాధారణ వైద్య పరీక్షల కోసం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. అలాగే జూలై 3న కూడా ఆసుపత్రిలో చేరి కొద్దిసేపు ఉండి డిశ్చార్జి అయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఎయిమ్స్‌లో చేరారు. రాత్రి పూట టెస్ట్‌లు చేయించుకుని వెళ్లిపోయారు.

అద్వానీకి ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్నతో సత్కరించారు. నవంబర్ 8, 1927న పాకిస్థాన్‌లోని కరాచీలో ఎల్‌కే అద్వానీ జన్మించారు. 1980లో సుదీర్ఘకాలం పాటు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం సాగింది. హోంమంత్రి, ఉప ప్రధానమంత్రితో సహా ముఖ్యమైన పాత్రలను నిర్వహించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో (1977-79) సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా చేశారు. 1980ల చివరలో రామజన్మభూమి ఉద్యమానికి అద్వానీ నాయకత్వం వహించారు. భారత హోం మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ జాతీయ భద్రతా వ్యవస్థలో అత్యంత సమగ్రమైన సంస్కరణలను తీసుకొచ్చారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనుకూలమైన మరియు రాజీలేని విధానాన్ని తీసుకొచ్చారు. కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి చిత్తశుద్ధితో పాటు స్థిరమైన ప్రయత్నాలు చేశారు.

ఇది కూడా చదవండి: Health Benefits: ఈ పండు అమృతం.. చలికాలంలో తిన్నారంటే రోగాలు మటుమాయం