Mumbai:|మహారాష్ట్రలోని వివిధ పట్టణాలు, నగరాల పేర్లను మార్పు చేస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కొన్ని పట్టణాలను ఇప్పటి వరకు ఉన్న పేర్లతో కాకుండా ఆయా పట్టణాలకు పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు సీ లింక్ పేరును మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మరో హార్బర్ లింక్ పేరును సైతం మార్చుతూ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also: Gaandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
వెర్సోవా-బాంద్రా సీ లింక్‌ను వీర్ సావర్కర్ సేతుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను సైతం అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతి న్హవా శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది. వంతెనకు సావర్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించిన దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన బీజేపీ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, దేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల పేర్ల మీద మార్చడం జరిగిందని పేరుపై గొడవలు ఉండవని అన్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్, లేదా వీర్ సావర్కర్, హిందూ జాతీయవాద నాయకుడు మరియు ఫైర్‌బ్రాండ్ విప్లవకారుడు, అటల్ బీహార్ వాజ్‌పేయి మాజీ ప్రధాని అని గుర్తు చేశారు.
Read also: Honour Killing: మరో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. మనస్తాపంతో ప్రేమికుడు సూసైడ్
1910లో సావర్కర్‌ను అరెస్టు చేసి.. జైలు శిక్ష విధించారని తెలిపారు. అతను 13 సంవత్సరాల పాటు అండమాన్, నికోబార్ దీవుల సెల్యులార్ జైల్లో (కాలా పానీలో) మగ్గిపోయాడని తెలిపారు. 1921 లో ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకాన్ని రాశారు గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు భారత ప్రధాని అయ్యారని తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1996 మరియు 2004 మధ్య మూడు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేసిన విషయం తెలిసిందే.
