NTV Telugu Site icon

M. Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు..

M. Venkaiah Naidu

M. Venkaiah Naidu

M. Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్యనాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించా.. అందుకే రాలేదు.. కానీ ప్రజా జీవితంలో ఆక్టీవ్ గా ఉంటా అన్నారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను ప్రధానితో చర్చించానని అన్నారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళనని తెలిపారు. సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తానని అన్నారు. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తా అన్నారు. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అని తెలిపారు. నేతలు పార్టీలు మారడం ట్రెండ్ గా మారిందని అన్నారు.

Read also: Rashi Singh: హృదయాలను కొల్లకొడుతున్న రాశి సింగ్..

ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరోచ్చు అన్నారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. యాంటీ డిఫెక్షన్ లాను బలోపేతం చేయాలన్నారు. రాజకీయపార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని తెలిపారు. చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవంజజ నేను ఉచితాలకు వ్యతిరేకం అన్నారు. విద్య ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని, ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతిపరులను ప్రజలు తిరస్కరించాలన్నారు. పార్టీకి నేను ఇచ్చే స్థానం నా జీవితంలో మారదన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని అన్నారు.

Read also: Snakes on a Plane: 10 అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం.. ప్రయాణికుడు అరెస్ట్

ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాలన్నారు. పార్టీ మారిన వారు వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నారు. రాముడు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదని, రాముడు ఈ దేశానికి ఆదర్శ పురుషుడని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇబ్బడి ముబ్బడిగా మేనిఫెస్టోల్లో హామీలు ఇస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు తగిన ఆర్థిక వనరులను పార్టీలు చూపించాలని అన్నారు. అప్పులు పెరిగిపోతున్న ఈ సమయంలో ఉచితాలు మానుకోవాలన్నారు. విద్య, వైద్యాన్ని ఉచితంగా నాణ్యంగా ఇవ్వాలన్నారు. దూషించే వారిని ఈ ఎన్నికలలో ఓడించాలని తెలిపారు. ఏ పార్టీకైనా మీరు ఓటెయ్యండి.. అవినీతిపరులకు ఓటు వేయవద్దని సూచించారు.
Mumbai Indians Playoffs: పట్టికలో ఏడో స్థానం.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే?

Show comments