Site icon NTV Telugu

Salman Khan: సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసులో కూరగాయల వ్యాపారి అరెస్ట్

Salman

Salman

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఇటీవల కాలంలో వరుస హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన బిగ్ బాస్ షో షూటింగ్ సమయంలో కూడా సల్మాన్ ఖాన్ భారీ భద్రత నడుమ పాల్గొన్నారు. ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వచ్చిన మెసేజ్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది కూరగాయల వ్యాపారి చేసిన పని అని వెల్లడైంది. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కష్టపడకుండా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో అతను ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: US- Russia: రష్యా బలహీనపడింది.. అందుకే కిమ్‌ సైన్యం మద్దతు కోరుతుంది..!

అయితే, నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తప్పించుకోవలనుకుంటే.. రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే.. లేకపోతే.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీకి పట్టిన గతే సల్మాన్ కు పడుతుంది. ఈ బెదిరింపుల్ని లైట్ తీసుకోవద్దని సదరు కూరగాయల వ్యాపారి హెచ్చరికలతో కూడిన మెసేజ్ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు పంపించాడు. ఆ తర్వాత తాను కావాలని బెదిరింపుల మెసేజ్ చేయలదేని.. అనుకోకుండా అలా చేశాను.. క్షమించాలని మరో మెసేజ్ పెట్టాడు. ఇక, విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ఝార్ఖండ్ పోలీసుల సహాయంతో జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని అరెస్ట్ చేశారు.

Exit mobile version