Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- తమిళనాడులో విజయ్‌పై మొదలైన విమర్శల వర్షం..
- వందేమాతరం తర్వాత చివరగా తమిళ గీతాన్ని పాడటంపై డీఎంకే ఫైర్..
- విజయ్ బీజేపీకి దగ్గరవుతున్నారని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Politics: తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇలా బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటలకే విజయ్‌పై విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష డీఎంకే, అధికార టీవీకేను విమర్శించింది. ప్రమాణస్వీకారంలో ‘వందేమాతరం’’ ముందుగా పాడటంపై డీఎంకే అభ్యతరం వ్యక్తం చేసింది. ‘‘తమిళ రాష్ట్ర గీతానికి’’ ప్రాధాన్యత ఇవ్వలేదని డీఎంకే మండిపడింది. తమిళ గీతానికి అవమానం జరిగిందని ఆరోపించింది.
Read Also: PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
చెన్నై రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముందు వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా రాష్ట్ర గీతం ‘‘తమిళ్ తాయ్’’ వినిపించారు. సాధారణంగా తమిళనాడులో తమిళ గీతం ముందుగా వినిపించి, చివరగా జాతీయ గీతం పాడటం ఆనవాయితీగా వస్తుందని డీఎంకే గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై టీవీకే స్పందిస్తూ.. కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరిగినందున పాటల క్రమాన్ని గవర్నర్ కార్యాలయం నిర్ణయిస్తుందని వివరణ ఇచ్చింది. అయితే, ఈ సమాధానంతో డీఎంకే సంతృప్తి చెందడం లేదు. టీవీకే బీజేపీ వైపు వెళ్తోందని ఆరోపించింది.
డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ.. తమిళ గీతాన్ని మూడో స్థానానికి నెట్టడం ద్వారా తమిళ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. టీవీకే ప్రభుత్వంలో ఉన్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలు తమిళ గీతానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. ఇదిలా ఉంటే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. వందేమాతరం తర్వాత జాతీయ గీతం ముందు ఉండాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!