Vande Bharat Trains: వందే భారత్ రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హై స్పీడ్‌తో వెళుతున్న రైళ్లు ప్రజలను తమ ఊర్తకు చేస్తున్నాయి. అటువంటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై కర్ణాటకలో రాళ్లు రువ్విన ఇద్దరు బాలురను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలురు రాళ్లు రువ్వడంతో రైలు అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు.
Read also: CPI Ramakrishna: కేంద్రమే బాధ్యత తీసుకొని.. పోలవరంను పూర్తి చేయాలి
ధార్వాడ్-బెంగళూరు నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన కేసులో ఇద్దరు మైనర్ బాలురను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను చిత్రదుర్గ అబ్జర్వేషన్ హోమ్లో ఉంచినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు తెలిపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై బాలురు రాళ్లు రువ్విన ఘటన జూలై 1న జరిగింది. రాళ్లదాడి చేసిన బాలురను ఎస్.ఎస్.నాగర, బాషాగా గుర్తించారు. బాలురు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రెండో విడతలో వందేభారత్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26న జెండా ఊపి ప్రారంభించారు. వారం తర్వాత వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరగడంతొ ప్రయాణికులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రాళ్లదాడి చేసిన ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు.
Read also: Shilpa Shetty Hot Pics: లేటు వయసులోనూ అన్ని చూపించేస్తున్న శిల్పా శెట్టి.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్!
వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన పశ్చిమబెంగాల్లోనూ జనవరిలో చోటుచేసుకుంది. హౌరా నుంచి న్యూ జల్పాయిగురి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. మాల్దా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అద్దాలు పగిలిపోయాయి. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.